బామ్మ : హ హ హ …… బుజ్జిహీరో బుజ్జిహీరో …… నువ్వు నా ప్రాణం ప్రాణం కంటే ఎక్కువ అని కన్నీళ్ల స్థానంలో ఆనందబాస్పాలతో అమాంతం నన్ను గుండెలపైకి తీసుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి పరవశించిపోతున్నారు …………
బామ్మ ……… అంతులేని ఆనందాన్ని పొందుతున్నట్లు కౌగిలిలోనే తెలిసి , దేవకన్యను చూస్తే ఎవరి పెదాలపైనైనా చిరునవ్వులు పరిమళించాల్సిందే కదా అని ఆనందించాను . బామ్మా ……. దేవత లాంటి మేడం మీకూ నచ్చినట్లున్నారు .
బామ్మ : దేవత …… ? అంటూ ఆనందంతో పులకించిపోతున్నట్లు తెలుస్తోంది .
ఎందుకో తెలియదు బామ్మా ……. , ప్రేయర్ లో మేడం ను చూడగానే స్వర్గం నుండి దిగివచ్చిన దేవతే అని నా హృదయం తెగ ఆరాటపడిపోయింది – ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం కూడా ఆ దేవతను చూడకుండా ఉండలేకపోయాను – కనురెప్పలు సైతం ఎంజాయ్ మహేష్ అన్నట్లు కనురెప్పలు కూడా వేయకుండా నాకు సహకరించాయి అంటూ కనురెప్పలపై ముద్దులుపెట్టుకున్నాను .
బామ్మ : సంతోషంతో నవ్వుకుని , బుజ్జిహీరో ……. అంత సహాయం చేసిన కనురెప్పలకు నేనూ ఒకసారి ముద్దులు పెట్టవచ్చా please please ……….
అడగాలా బామ్మా ……. , మీ మనవరాలి విషయంలో నన్ను అర్థం చేసుకున్న మీకోసం ఏమైనా చేస్తాను అనిచెప్పానుకదా ……..
బామ్మ : థాంక్యూ థాంక్యూ soooo మచ్ బుజ్జిహీరో ……. అంటూ ఆనందబాస్పాలతో నా బుగ్గలను అందుకుని థాంక్స్ కనురెప్పలూ అని కనురెప్పలపై మరియు నుదుటిపై ఒక మధురానుభూతికి లోనయ్యేలా ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు .
బామ్మా …….. దేవత ఫోటో చూసిన క్షణం నుండీ క్షణక్షణానికీ మీ ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది కారణం ఏమిటి ? .
బామ్మ : దానికి ఏకైక కారణం నా బుజ్జి బుజ్జిహీరో ……. , నీ మనసులోని మాటను తెలిపి ఎంత ఆనందాన్ని – పారవశ్యాన్ని కలిగించావో మాటల్లో చెప్పలేను బుజ్జిహీరో …….. అంటూ మళ్లీ నా నుదుటిపై ముద్దుపెట్టారు – sorry బుజ్జిహీరో …….. కోటాకు మించి ముద్దులుపెట్టేస్తున్నాను కానీ ఎన్ని ముద్దులుపెట్టినా తనివితీరనంత ఆహ్లాదాన్ని పంచావు అంటూ కంట్రోల్ చేసుకోలేక మళ్లీ ముద్దుపెట్టారు .
హ హ హ ……. బామ్మా డబ్బుల్లా ఖర్చు అవుతాయా చెప్పండి , ఎన్ని ముద్దులు కావాలంటే అన్ని ముద్దులు పెట్టుకోండి నేనేమైనా వద్దన్నానా ? , బుజ్జిదేవత ఫోటోలు వెనక్కు ఇచ్చెయ్యగానే మీ కన్నీళ్లు చూసి నా బుజ్జి హృదయం చలించిపోయిందనుకోండి తట్టుకోలేకపోయాను – దేవతను వదిలి ……….
బామ్మ : లేదు లేదు లేదు బుజ్జిహీరో …….. , నా ప్రియమైన బుజ్జిహీరో ……. దేవతను ఫిక్స్ అవ్వడమే కరెక్ట్ – నా మనఃస్ఫూర్తిగా చెబుతున్నాను కదా , ఎందుకన్నది అత్యంత త్వరలోనే నా బుజ్జిహీరోకు కూడా తెలుస్తుంది అని ముఖమంతా ముద్దులవర్షం కురిపించి , తల్లీ దుర్గమ్మా ……. అంటూ సంతోషంతో ప్రార్థించారు .
నేను కూడా బామ్మ బాధపడకుండా దీవించినందుకు పెద్దమ్మకు థాంక్స్ చెప్పుకున్నాను .
బామ్మ : బుజ్జిహీరో ……. నేను దుర్గమ్మ తల్లికి మొక్కుకున్నాను మరి నువ్వు ఎవరికి మొక్కుకుంటున్నావు .
నెల ముందువరకూ మా దైవం కూడా దుర్గమ్మ తల్లినే బామ్మా ……. , రీసెంట్ గా దుర్గమ్మ అమ్మతోపాటు పెద్దమ్మ కూడా మా దైవం అయ్యారు .
బామ్మ : పెద్దమ్మ ? ……..
అంతలో లోపలినుండి బామ్మా బామ్మా ……. అంటూ వేణుగానం లాంటి పిలుపులు – బామ్మా …….. నైట్ డ్రెస్ ఎక్కడ ఉంచావు ? .
ఆ వాయిస్ ఆ వాయిస్ ………. ? .
బామ్మ : కంగారు కంగారుగా , తల్లీ ……. అక్కడే ఉంచాను సరిగ్గా చూడు …….
got it బామ్మా ……. , బామ్మా ……. వేడివేడిగా కాఫీకావాలి ? .
ఆ వాయిస్ వాయిస్ అంటూ థింక్ చేస్తున్నాను .
బామ్మ మరింత కంగారుపడి , తల్లీ ……. నాకు ముఖ్యమైన పని ఉంది నువ్వే చేసుకో ……. , బుజ్జిహీరో ……. దైవం పెద్దమ్మ అన్నావు కదూ ఎవరు ? .
వాయిస్ వాయిస్ …….. ఆ ఆ పెద్దమ్మ పెద్దమ్మ …….
బామ్మ : బుజ్జిహీరో …….. నీ దేవత గురించి కూడా తెలుసుకోవాలని ఉంది – మనం దగ్గరలోని గుడికివెళ్లి మాట్లాడుకుందాము – ఇంత సంతోషాలను పంచిన తల్లిని ….. నా బుజ్జిహీరోతోపాటు వెళ్లి వెంటనే దర్శించుకోవాలి – నీకు ఇష్టమే కదా ………
లోపలనుండి బామ్మా ……. అంటూ పిలుపు .
వాయిస్ …….. ? .
బామ్మ : అమ్మో …….. , తల్లీ ……. ముఖ్యమైన వ్యక్తితో గుడికి వెళుతున్నాను బై బై అంటూ ఆలోచిస్తున్న నా చేతిని అందుకుని వడివడిగా మా ఏరియా లోని గుడికి తీసుకెళ్లి అమితమైన సంతోషం – భక్తితో మొక్కుకుని గుడి మెట్లపై కూర్చున్నారు .
వాయిస్ వాయిస్ అంటూనే వెళ్లి ప్రక్కనే కూర్చున్నాను .
బామ్మ : వదిలేలా లేడు అని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . బుజ్జిహీరో ……. చెప్పాను కదా ” పెద్దమ్మ – నీ దేవత ” గురించి తెలుసుకోవాలని , నువ్వుమాత్రం పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తున్నావు , ఇలా అయితే ……
Sorry sorry బామ్మా …….. , ఆ వాయిస్ …….
బామ్మ : అదిగో మళ్లీ ……..
Sorry sorry ……. అంటూ బామ్మ చేతిని అందుకుని , కమాన్ బామ్మా ……. ఏమి తెలుసుకోవాలని అనుకుంటున్నారు ? .
బామ్మ : ఉమ్మా ఉమ్మా అంటూ నా చేతులపై ముద్దులుపెట్టి , నా బుజ్జిహీరోకు ఇద్దరు దైవాలు ఒకరు దుర్గమ్మ తల్లి నాకు తెలుసు మరి దైవం పెద్దమ్మ ఎవరు ? .
పెద్దమ్మ పెద్దమ్మ – మా కోరికలు మరియు మేము కోరుకోకముందే తీర్చడానికి మాకోసం వచ్చినవారు అంటూ చిన్న ఇంటిని ” అవ్వ అనాదశరణాలయంలా ” మార్చి సంతోషాలను పంచడం – అవ్వ పిల్లలు కోరినవన్నీ తీరుస్తుండటం – అప్పుడప్పుడూ నా కోరికలను కూడా …….. అంటూ సిగ్గుపడుతూ వివరించాను – బామ్మ కళ్ళల్లో కన్నీళ్లను చూసి బామ్మా బామ్మా …….. ఏమైంది ? అంటూ బాధపడుతూ అడిగాను .
బామ్మ : నా బుజ్జిహీరో భువిపైకి చేరిన క్షణం నుండీ కష్టాలు అనుభవించాడు అని ప్రాణంలా గుండెలపైకి తీసుకున్నారు .
బామ్మా ……. ఆ రోజులన్నీ పోయాయి దైవం పెద్దమ్మ వలన – పెద్దమ్మ ఆశీర్వాదం వల్లనే చదువుకుంటూనే , ఆడుకుంటూనే జాబ్ చేస్తున్నాను – ఏదైనా అలా కోరుకోవడం ఆలస్యం ఇలా తీర్చేస్తారు , మనలోమాట అంటూ చెవిదగ్గరికివెళ్లి బామ్మా …… అప్పుడప్పుడూ పెద్దమ్మను ఆర్డర్ కూడా వేస్తున్నాను తెలుసా ఎవ్వరికీ చెప్పకండి – రెండురోజుల ముందు అవ్వలకు …… పెద్దమ్మ చెప్పినది నిజమైంది , ఏమిచెప్పారో తెలుసా పెద్దమ్మా …….. త్వరలోనే నిన్ను ప్రాణంలా చూసుకునే వారు – నువ్వు ప్రాణంలా చూసుకునేవారు జీవితంలోకి వస్తారు అని , అలా చెప్పారు ఇలా మా బామ్మ గారు అంటూ ప్రాణంలా హత్తుకున్నాను .
బామ్మ : ఆనందబాస్పాలతో నిజమే బుజ్జిహీరో నువ్వు నా ప్రాణం , త్వరలో ప్రాణం కంటే ఎక్కువ అని నీకే తెలుస్తుంది – ఇక మేమంటే ……. నా బుజ్జిహీరోకు ఎంత ప్రాణమో ఒక్కరోజులోనే నాకు పూర్తిగా అర్థమైపోయింది అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు – ఇదంతా విన్న తరువాత ఈ క్షణం నుండీ మాకు కూడా ఇక ఇద్దరు దైవాలు దుర్గమ్మ తల్లి మరియు పెద్దమ్మ ………..
బామ్మా ……. బామ్మతోపాటు దేవతను కూడా అని చిన్నగా చెప్పాను .
బామ్మ : నవ్వుకుని , బుజ్జిహీరో …….. నా ఇష్టం చాలా చాలా ఇష్టం అని చెప్పాను కదా , నువ్వేమి ఫీల్ అవ్వకు ……. , ఎవరిని ఎవరి దగ్గరకు చేర్చాలో మన దైవాలకు తెలియదా చెప్పు ఉమ్మా ఉమ్మా ……. అంటూ ప్రాణమైన ముద్దులుపెట్టారు . అవును బుజ్జిహీరో …….. ఒక విషయం అడుగుతాను నువ్వు ఫీల్ అవ్వకూడదు ……. , ok నువ్వేమో ** క్లాస్ స్టూడెంట్ – మేడం sorry sorry నీ ప్రియాతిప్రియమైన దేవత ఏమో డిగ్రీ పూర్తిచేసి నీకు టీచ్ చెయ్యడానికి వచ్చింది , ఏజ్ గ్యాప్ ఎక్కువ అనిపించడం లేదూ ………
నిజమే బామ్మా …….. , కానీ ప్రేమ గుడ్డిది అంటారుకదా అలా వయసుతో సంబంధం లేదు అని ఫిలాసఫీ చెబుతున్నట్లు చెప్పాను .
బామ్మ : మురిసి , నిజమే నిజమే …….. , నా బుజ్జిహీరోపై సినిమాల ప్రభావం ఎక్కువగానే ఉందని నవ్వుకున్నాము .
నవ్వు ఆపి అవును బామ్మా …….. , నా దేవత డిగ్రీ పూర్తిచేసిందని మీకు చెప్పనేలేదు మీకెలా తెలిసింది , కరెక్ట్ గా ఎలా చెప్పారు ……..
బామ్మ : కంగారుపడుతూ అదీ అదీ …….. ఆ ఆ ఆమాత్రం దానికి ఒకరు చెప్పాలా బుజ్జిహీరో – మేడం గా జాయిన్ అవ్వాలంటే డిగ్రీ పూర్తిచేసి ఉండాలికదా అని నార్మల్ గా చెప్పాను , అంతదానికి ఎంక్విరీ లు చెయ్యాలా అంటూ బుగ్గపై ప్రేమతో గిల్లారు .
Sorry sorry బామ్మా ……. అని నవ్వుకున్నాను .
బామ్మ : నెక్స్ట్ …… , ప్రేయర్లో చూసిన దేవతను ఒక్క క్షణం కూడా చూడకుండా ఉండలేను అన్నావుకదా మరి నీ దేవత వేరే క్లాస్సెస్ కు వెళ్లి ఉంటుంది కదా …….
ఇలా జరగకూడదనేనేమో పెద్దమ్మ ……. నన్ను చిన్నప్పుడే తెలుగు మీడియం govt కాలేజ్లో జాయిన్ చేశారు – ఇంగ్లీష్ మీడియం కాలేజ్లో జాయిన్ అవ్వగానే ఒక తమాషా జరిగింది బామ్మా …… నా ఇంగ్లీష్ పరిజ్ఞానానికి నవ్వుకుని ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్సెస్ అన్నింటికీ అటెండ్ అవ్వాలి అని రూల్ పెట్టారు కాదు కాదు పెట్టాడు ఆ హెడ్ మాస్టర్ కానీ నా దేవత రావడంతో ………
బామ్మ : ok ok పనిష్మెంట్ వరంలా మారిపోయిందన్నమాట పెద్దమ్మ వలన ……. అంటే నీ దేవత ఇంగ్లీష్ మేడం అన్నమాట ……..
అవునవును బామ్మా ……. , అయినా ఇంగ్లీష్ టీచర్ అని నేను చెప్పనేలేదు …….
బామ్మ తియ్యనైన కోపంతో చూస్తున్నారు .
Ok ok వరంలా మారింది అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు కదా sorry sorry బామ్మా ………
బామ్మ : sorry లు మాత్రమే సరిపోవు అని అలక చెందారు .
తియ్యనైన నవ్వులతో బుగ్గలపై ముద్దులుపెట్టాను .
బామ్మ పెదాలపై చిరునవ్వులు పరిమళించాయి – అయితే ఇక మొదటి క్లాస్ నుండి లాంగ్ బెల్ వరకూ సైట్ కొడుతూనే ఉన్నావన్నమాట ……..
అంటే సైట్ కొట్టినట్లా బామ్మా ……..
బామ్మ : అంతా చేసి ఎంత అమాయకంగా అడుగుతున్నాడో చూడండి దేవతలూ …….. అని బుగ్గను గిల్లి నవ్వుకున్నారు . చెప్పు చెప్పు బుజ్జిహీరో ఎలా సైట్ కొట్టావు ? , మొత్తం తెలుసుకోవాలని ఉంది .
ప్రతీ క్లాస్ లో దేవత కోపం – ఇంటర్వెల్ ముందు దెబ్బ ……..
బామ్మ : నా బుజ్జిహీరోను కొట్టిందా ? , ఎంత ……..
కూల్ కూల్ బామ్మా ……. , అక్కడ మీరు దెబ్బను చూస్తున్నారు – నేను …… నా దేవత చేతి స్పర్శను ఎంజాయ్ చేసాను అని సిగ్గుపడ్డాను .
బామ్మ కూడా నవ్వుకుని , ఈ చెంపపైనేనా కొట్టినది అని ప్రాణంలా స్పృశించి ముద్దుపెట్టారు – బుజ్జిహీరో …… గట్టిగానే కొట్టినట్లుంది ఇప్పటికీ బుగ్గ కందిపోయినట్లు కనిపిస్తోంది – నా బుజ్జిహీరోను కొట్టిన ప్రియమైన దేవతకు నాలాంటి బామ్మ ఉండాలి , ఆ బామ్మ …… తన మనవరాలిని కూడా ఇలానే కొట్టాలి పెద్దమ్మా ……. నా తొలి కోరిక తీరుస్తారు కదూ ……..
నో నో నో బామ్మా ……. , కోరుకున్నారా ఇక కోరిక తీరినట్లే – పెద్దమ్మ తప్పకుండా తీరుస్తారు , అందులోనూ మా మంచి బామ్మ తొలి కోరిక ……. , పెద్దమ్మా …… కాస్త సున్నితంగా కొట్టండి ఎందుకంటే నా బుగ్గ కందిపోవడానికి కారణం నేను మాత్రమే కాబట్టి …….. , బామ్మా ……. దేవత చేతి స్పర్శ తగిలిందని పదే పదే చేతితో ఆశతో బుగ్గపై తాకిస్తూ ముద్దులుపెట్టుకోవడం వలన అలా ……. అంటూ సిగ్గుపడ్డాను .
బామ్మ : నా బుజ్జిహీరో పైకి కనిపించేంత అమాయకుడేమీ కాదు , ఏదీ నీ ప్రియమైన దేవత చెంపదెబ్బ రుచిని నన్నూ చూడనివ్వు అని ముద్దులుపెట్టి , తియ్యదనంతో చూసారు ఇందుకన్నమాట పదే పదే ముద్దులుపెట్టుకున్నావు అని నవ్వుకున్నారు – పెద్దమ్మా ……. అయినా కూడా దేవతకు , బామ్మా ద్వారా ఒక దెబ్బ పడాల్సిందే ……….
ప్చ్ ప్చ్ ……. దేవత అంటేనూ ఇష్టం – మా బామ్మ అంటే అంతకంటే ఇష్టం ప్రాణం కాబట్టి పెద్దమ్మే ఏది మంచినో నిర్ణయించి కోరికలు తీర్చాలి . అయినా బామ్మా …… నాకు పెద్దమ్మ అయితే మీకు కూడా పెద్దమ్మ ఎలా అవుతుంది ? .
బామ్మ : దేవతల వయస్సు వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలు అని బుజ్జిహీరోకు తెలుసనుకున్నానే ……. , అంత వయసు అయితే నాకూ పెద్దమ్మే – ఒకవేళ చిన్నదైతే ప్రేమతో తల్లీ అని పిలుస్తాను . హ్యాపీనా ……. ? .
మా బామ్మకు మనవరాలు మాత్రమే ఉన్నారు కాబట్టి , పెద్దమ్మ వయసు తక్కువగానే ఉండాలి అప్పుడు కూతురు కూడా ఉంటారు – బుజ్జిదేవత తప్పు తప్పు బామ్మ మనవరాలికి అమ్మప్రేమకూడా ………
బామ్మ : నాకు బిడ్డ – నా బుజ్జితల్లికి అమ్మ …… ఈ మధురమైన భావనే ఎంత బాగుంది అంటూ భావోద్వేగానికి లోనై , బుజ్జిహీరో అంటూ ఆనందబాస్పాలతో ప్రాణంలా హత్తుకున్నారు – అయినా నాకు మనవరాలు మాత్రమే కాదు మనవరాలి కంటే ప్రాణమైన మనవడు కూడా ఉన్నాడు కదా …….. , అంటే నువ్వు అలా భావించడం లేదన్నమాట ……..
అంతటి అదృష్టాన్ని ఏ మనవడైనా కాదనుకుంటాడా బామ్మా అంటూ బామ్మతో సమానంగా ఉద్వేగానికి లోనయ్యి సంతోషంతో నవ్వుకున్నాము .
ఆ సంతోషంలో గంటపైనే సమయం గడిచిపోయింది . బామ్మా ……. ఇంటిలో మీ మనవరాలు ఒక్కరే ఒంటరిగా ఉన్నారుకదా ….. , భయపడుతుందేమో …….
బామ్మ : నా బుజ్జిహీరోతో ఉంటే సమయమే తెలియదు – బుజ్జితల్లి గురించే మరిచిపోయాను అంటూ పైకిలేచారు – బుజ్జిహీరో ……. భయం అంటే గుర్తుకొచ్చింది , నిన్న అర్ధరాత్రి సమయంలో భూత్ బంగ్లా నుండి ఏవో మాటలు వినిపించాయని బుజ్జితల్లి భయంతో మరింత గట్టిగా హత్తుకుని కొద్దిసేపు నిద్రకూడాపోలేదు – అమ్మా దుర్గమ్మా …… అని కంగారుపడుతూ ప్రార్థించారు – బుజ్జిహీరో వెళదాము అని ఇంటికిచేరుకుని ఒక్కనిమిషం ఇక్కడే ఉండు అని లోపలికి పరుగునవెళ్లారు .
నా ప్రాణమైన వాళ్లనే భయపెడతావా అంటూ భూత్ బంగ్లా వైపు కోపంతో చూస్తున్నాను .
బామ్మ వచ్చి బుజ్జిహీరో ……. నీకోసం ప్రేమతో చేసిన స్నాక్స్ అంటూ అందించారు .
Wow …… ఇవంటే నాకు చాలా ఇష్టం బామ్మా అంటూ హత్తుకుని బుగ్గపై ముద్దుపెట్టాను . మినీ గ్రౌండ్ దగ్గర నుండి ఫ్రెండ్స్ ……. క్రికెట్ ఆడటానికి పిలవడంతో బామ్మకు బై చెప్పి కాలేజ్ బ్యాగుతోనే వెళ్ళాను .
వినయ్ : మహేష్ ……. ఏంటి ఇంకా కాలేజ్ బ్యాగ్ – కాలేజ్ డ్రెస్ లోనే ఉన్నావు .
మురళి : వాడు ఇంకా ఇంటికి వెల్లనేలేదు , ఇక్కడే అటూ ఇటూ తిరుగుతున్నట్లున్నాడు – ఇంటికి రాకుండా ఏమిచేస్తున్నావురా ………
మురళీ సర్ అదీ అదీ ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉన్నాను అందుకే గుడికి వెళ్ళాను .
మురళి : నిజమా ……. ? .
గోవర్ధన్ : చూస్తుంటేనే తెలుస్తోంది కదా మురళీ …… , కుంకుమ కూడా ఉంది – మహేష్ బాక్స్ లో ఏమిటి అంత జాగ్రత్తగా పట్టుకున్నావు .
స్నాక్స్ ఫ్రెండ్స్ ……. , ఒక దేవతలాంటి బామ్మగారు ప్రేమతో ఇచ్చారు – టేస్ట్ చేయండి వేడివేడిగా కారకారంగా ……… అంటూ బాక్స్ ఓపెన్ చేసాను .
ఫ్రెండ్స్ : wow …… నువ్వు చెబుతుంటేనే నోరూరిపోతోంది మహేష్ అంటూ టేస్ట్ చెయ్యడానికి పోటీపడుతున్నారు .
మురళి : రేయ్ రేయ్ స్టాప్ స్టాప్ …….. , ఎవరో అలగా జనం ఇస్తే అలా ఎగబడిపోవడమేనా , తిన్నారంటే అంకుల్ వాళ్లకు చెబుతాను .
అంతే ఎక్కడివాళ్ళు అక్కడే ఆగిపోయారు – రేయ్ మహేష్ ……. ఎవరుపడితే వాళ్ళు ఇచ్చిన ఫుడ్ మేము తినము , మా లెవల్ ఏమిటి స్టేటస్ ఏమిటి …….. వెళ్లు వెళ్లి నువ్వు మాత్రమే తిను .
మురళి మాటలకు కోపం వేసినా , మొత్తం నేనే తినబోతున్నానని కలిగిన ఆనందానికి కోపం మొత్తం హుష్ కాకి అయ్యింది – పేదవాళ్లను చులకనగా చూస్తున్నందుకు మాత్రం ప్రతీసారీ బాధవేస్తూనే ఉంది .
వినయ్ : మహేష్ …….. తొందరగా వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకునిరా మ్యాచ్ ఆడదాము.
మురళి : నో ……. , రోజూ ఈ సమయానికి మ్యాచ్ ఆడతామని తెలిసికూడా నాకు చెప్పకుండా గుడికి వెళ్ళాడు కాబట్టి ఈరోజుకు వాడికి ఇష్టమైన క్రికెట్ బ్యాట్ ముట్టుకోవడానికి వీలు లేదు అలా అని ఇంటికి వెళ్ళడానికి కూడా వీలులేదు – రేయ్ మహేష్ ……. మేము ఆడుకునేంతవరకూ అక్కడ కూర్చో ఇదే నీ పనిష్మెంట్ అని ఆర్డర్ వేసి మ్యాచ్ స్టార్ట్ చేశారు .
గుడికి వెళ్లినందుకే పనిష్మెంట్ ఇచ్చాడు , నిన్న బామ్మగారికి సహాయం చేశానని – ఇప్పటివరకూ బామ్మతోపాటే ఉన్నానని తెలిస్తే ఇక అంతే గోల గోల చేసేస్తాడు అని పెదాలపై చిరునవ్వులతో బ్యాగును ప్రక్కన ఉంచి బల్లపై కూర్చున్నాను . బాక్స్ ఓపెన్ చేసి ఆలూ స్నాక్స్ – స్వీట్ తిని మ్మ్మ్ మ్మ్మ్ …… స్పైసీ అండ్ స్వీట్ లవ్లీ కాంబినేషన్ అంటూ కళ్ళుమూసుకుని ఎంజాయ్ చేస్తున్నాను .
ఫీల్డింగ్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరూ లొట్టలేస్తూ నావైపు ఆశతో చూస్తున్నారు – టేస్ట్ చెయ్యాలని ఆశ ఉన్నా మురళికి భయపడి తమను తాము కంట్రోల్ చేసుకుంటున్నారు – బాక్స్ మొత్తం ఒక్కడే ఖాళీ చేసేస్తున్నాడు అని దీనంగా చూస్తూ ఫీల్డింగ్ కూడా మిస్ చేస్తుండటం చూసి నవ్వుకున్నాను .
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ బామ్మా ……. , అచ్చు అవ్వలు చేసినట్లుగానే భలే రుచిగా ఉన్నాయి , ఎదురుగా ఉండి ఉంటే గుండెలపైకి చేరి మరింత కావాలని ఆడిగేవాడిని ప్రాధేయపడేవాడిని అంటూ బామ్మ ఇంటివైపు చూసాను .
ఆశ్చర్యం ఇంటిపైనుండి ఇప్పటివరకూ నన్నే చూస్తున్నట్లు hi బుజ్జిహీరో అంటూ చేతిని ఊపి స్నాక్స్ ఎలా ఉన్నాయి అని సైగలతో అడిగారు .
సూపర్ సూపర్ సూపర్ ……. అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వధలబోయి ఇంకా అంత ఆప్యాయతకు చేరుకోలేదని ఆగిపోయాను – బామ్మా ……. ఖాళీ అంటూ బాక్స్ ను తిప్పి చూయించాను – ఆకలేస్తోంది బామ్మా ……. please please అంటూ కడుపును స్పృశించుకున్నాను .
బామ్మ పరుగున కిందకువెళ్లారు . పెదాలను తడుముకుంటూ మెయిన్ గేట్ వైపు ఆశతో చూస్తున్నాను .
5 నిమిషాలకు బామ్మనే స్వయంగా బాక్స్ తోపాటు బయటకువచ్చారు .
పెదాలపై చిరునవ్వుతో యాహూ అని కేకవెయ్యబోయి ఆగిపోయాను – ఆ వెంటనే మురళిని చూసి గుండె ధడ ధడా కొట్టుకుంది . మురళి బామ్మను ఏమైనా అంటే తట్టుకోగలనా అంటూ పైకి లేవబోతే ……..
మురళి చూసి రేయ్ ఎక్కడికిరా మ్యాచ్ పూర్తయ్యేంతవరకూ కదాలకూడదు అనిచెప్పానుకదా – కిట్స్ ఎవరు తీసుకొస్తారు కూర్చో కూర్చో ……..
అయ్యో ……. ఇప్పుడేమి చెయ్యడం ( బామ్మా బామ్మా …… రావద్దు ) – అంతలో బామ్మ గేట్ క్లోజ్ చేసి రోడ్డులో ముందుకువెళ్లిపోవడం చూసి హమ్మయ్యా అనుకున్నాను – రెండు నిమిషాలకు మళ్లీ లోపలికివెళ్లిపోయారు చూస్తే చేతిలో బాక్స్ కనిపించలేదు .
అదే బాక్స్ తో సెక్యూరిటీ అన్నయ్య వచ్చి మహేష్ డెలివరీ అని ఇచ్చి వెళ్ళిపోయాడు .
Hindi Sex Stories – LustMasti
